Friday, March 9, 2007

మా ఇల్లూ.., మా ఇంట్లో వాళ్ళు!!

నేను చెప్పాగా మాది రాజమండ్రి అని.., మా ఇల్లు ఆ ఊళ్ళో గోదారి దగ్గరే.మా ఇల్లు చాలా పేద్దది.., కానీ మేము అయిదు మంది ఉంటాము.
నేను, మా అమ్మ, మా నాన్నారు, మా బామ్మ, తాత గారు..., ఇంతే ఇంక ఎవరూ ఉండరు .
మా నాన్నారు ఉజ్జోగం చేస్తున్నారు, మా తాత గారు రిటైరు ఐపొయారు.మా అమ్మ వంట చేసుకుంటూంది, మా బామ్మ వత్తులు చేస్కుంటూంది.
నేను క్సూల్ కి వెళతాను .., కానీ రొజూ వెళ్ళాలంటే అంత ఇష్టం లేదు ., కాని మా నాన్నారు చదూకోమ్మా బంగారు తల్లీ అని అంటారు ..,
నేను రోజూ క్సూల్ కి వెళతాను మధ్యలో కడుపు నొప్పి అని చెప్పి వచేస్తా..,
మా ఇంటికి కొంచం పక్కనే ఆ బుడుగు గాడి ఇల్లు ,, నేను బుడుగు, రోజూ క్సూల్ ఐపోయాకా కొంచం ఎక్కువ అల్లరే చేస్తాము
( ఇంకా ఉంది రేపు రాస్తా మిగిలింది..... )

Wednesday, February 28, 2007

మా ఊరు !!!




నా గురించి చెప్పాలంటే.., చాలా పేద్దవిషయాలు ఉన్నాయి.

మాది తూ గో జిల్లా లో రాజమండ్రి...,

మా ఊళ్ళో పేద్ద గోదారి ఉంది.., గోదారి అంటే నీళ్ళన్నమాట అది చాలా పొడుగు .., ఎక్కడ్నించి అందులోకి నీళ్ళు వస్తాయో ఎవరికీ తెలీదు .

మా గోదారి.... తల్లి గోదారి !!!


మా గోదారి మీద పేద్ద పేద్ద బ్రిజ్జీ లు మూడు ఉన్నాయి.., పేరుకి మూడు ఉన్నాయా అందు లో రెండే పనిచేస్తాయి అన్నమట .., ఒక బ్రిజ్జి ముసలిది ఐపొయింది మా తాత గారిలా .., మా తాత గారు ముసలి వాడు ఐపోయారని .., మీరు ఉజ్జోగం చెయ్యక్కర్లేదు అని చెప్పి ఇంటికి పంపేసారు.( కాని ప్రతీ నెలా జీతం మాత్రం ఇస్తారు..., ఎందుకో మరి ???) , దాన్నే రిటైరు ఐపొవడం అని అంటారుట మా నాన్నారు చెప్పారు.., అలా పాత బ్రిజ్జీ కుడా రిటైరు ఐపొయింది అన్నమాట ...

మా ఊళ్ళో చాలా పేద్ద గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారంట నాకు లాగా..,
భారతమో ఎదో రాసాడంట నన్నయ్య .., కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇలా చాలా మందే పుట్టారు మా ఊళ్ళో..,

అస్సలు మా ఊరే చాలా గొప్ప ఊరు .., ఎందుకంటే వేదం లా ఘోషించే గోదారి మా ఊళ్ళో ఉంది కాబట్టి.

గోదారి లో నీళ్ళు చూడాలంటే మీరు గోదారి గట్టు కి వెళ్ళచ్చు లేకపొతే రైలెక్కి బ్రిజ్జి మీద కొవ్వూరు వెళ్తుంటే బొల్డు గోదారి చూడచ్చు .., అలా చూస్తే ఎంత బాగుంటుందో ఎంచక్కా !!!
ఈ బ్రిజ్జీ బొమ్మ ని దానం చేసిన దాత మా కాంతు గాడు.. akas Devi Kanth Marre.. http://devikanth.blogspot.com

Monday, February 26, 2007

పెసూన పురాణం........

పెసూన పురాణం........
శివుడు గురించి తెలుసుకోవాలంటే.., శివ పురాణం చదవాలి...
శ్రీ మహా విష్ణువు గురించి తెలుసుకోవాలంటే... విష్ణు పురాణం చదవాలి...

మరి పెసూన గురించి తెలుసుకోవాలంటే..., పెసూన పురాణం బ్లాగు లోకి రావాలి !!!
ఆనాటి పురాణాలే నేటి బ్లాగులని ఈ సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది !!!